మన న్యూస్, ఎస్ఆర్ పురం :-

ప్రజా సమస్యల పరిష్కారమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వం జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ పాల్గొన్నారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదని అందుకే నేడు పంచాయతీ పంచాయతీకి గ్రీవెన్స్ పెట్టిన నేడు ప్రజా పరిష్కార వేదికకు సుమారు 500 నుంచి 700 వరకు అప్లికేషన్ వస్తున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు తాను ఎప్పుడు ప్రజల అభివృద్ధికి పని చేస్తున్నానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ మురళి, తాసిల్దార్ లోకనాథం పిళ్ళై వ్యవసాయాధికారి నర్మదా విద్యుత్ శాఖ విజయ శేఖర్, టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు సాఫ్ట్వేర్ బాలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ చంద్ర నాయుడు బాలాజీ నాయుడు పైనేని మురళి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, మాధవ నాయుడు, చంద్రబాబు రెడ్డి, భూపతి రెడ్డి, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నాగరాజు, గురునాథం ,మధు,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *