

అభినందించిన శ్రీ భారతి విద్యాసంస్థల అధినేత సుంకర వీరబాబు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో మొదటి విడతలో 6వ తరగతి ప్రవేశానికి తుమ్మల ఐశ్వర్య (1014337),9వ తరగతి ప్రవేశానికి నరవ గాయత్రి (115084) ఎంపికైనట్లు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి శ్రీ భారతి విద్యా సంస్థల కోచింగ్ సెంటర్ కరెస్పాండంట్ సుంకర వీరబాబు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా సుంకర వీరబాబు అహర్నిశలు కష్టపడి నవోదయ సీట్లు సాధించిన తుమ్మల ఐశ్వర్యని,నరవ గాయత్రిని పుష్పగుచ్చం అందచేసి అభినందించారు.శ్రీ భారతి విద్యాసంస్థల అధినేత సుంకర వీరబాబు మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలుగుతూ తల్లితండ్రులకు మంచి పేరు తీసికొని రావాలని భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు పలువురు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.