


మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద,పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలాలల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ,జగదీశ్వర్ రెడ్డి లు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వీధుల గుండా దిష్టిబొమ్మను తీసుకొని తిరుగుతూ నినాదాలు చేస్తూ చౌరస్తాలో కేటీఆర్ ,జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనుచిత వాక్యాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకు లక్ష్మయ్య,అనీష్ పటేల్, మల్లయ్య గారి ఆకాష్,లోక్య నాయక్,భూషణం గౌడ్,ఖాలీక్,వెంకట్ రెడ్డి,గాండ్ల రమేష్,గౌస్ పటేల్,రాథోడ్ రాము,బండ్ల ప్రవీణ్,బ్రహ్మం,చాంద్ పాషా,సంతోష్,గైని రమేష్,తదితరులు ఉన్నారు.