Mana News :- తిరుపతి,నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని బొడుగు ముని రాజా యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అమరావతిలో ఎమ్మెల్యే అని సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల టిడిపి సీనియర్ నాయకులు పేరం ధనుంజయలు నాయుడు, కందాటి శివ శంకర్ రెడ్డి, రంగినేని చెంచయ్య నాయుడు, పాపిరెడ్డి, కన్నలి మోహన్ రెడ్డి, కేశినేని సుబ్రమణ్యం, దేవి నాయుడు, వేమల జగదీష్నాయుడు, ఎస్ ఉమాపతి యాదవ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *