• నిర్లక్ష్యపు నీడలో 800 ఏళ్ల నాటి నంది విగ్రహం
  • కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకులు శివనాగిరెడ్డి.

మన ధ్యాస,మక్తల్, నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జక్లేర్ లో నిర్లక్ష్యంగా పడి ఉన్న 800 సంవత్సరాల నాటి నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మక్తల్ కు చెందిన వారసత్వ కార్యకర్తలు డా.గవినోళ్ల మహేందర్ రెడ్డి, కలాల్ భాస్కర్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం నాడు జక్లేర్ లోని కాకతీయుల కాలపు శిధిల త్రికోటాలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని, ప్రాంగణాన్ని శిల్పాలను పరిశీలించారు. 13వ శతాబ్దినాటి త్రికూటాలయంలో ఒక ఆలయానికి మాత్రమే శిఖరం ఉందని, మిగతా రెండు ఆలయాలకు శిఖరాలు, రంగ మండపం శిథిలమైందని, ఒక ఆలయంలో ఉమామహేశ్వర విగ్రహం, మరో ఆలయంలో శివలింగం భిన్నమై ఉన్నాయని, ప్రధానాలయం ముందు నాలుగడుగుల ఎత్తు రెండు అడుగుల వెడల్పు గల 23వ జైన తీర్థంకుడైన పార్శ్వనాథుడి విగ్రహం ఉందని. ఈ ఆలయాలు అపురూప శిల్పాలు జక్కిలేరు చరిత్రకు అద్దం పడుతున్నాయన్నారు.ఆంజనేయస్వామి ఆలయంముందు రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో కాకతీయుల కాలపు (13వ శతాబ్ది) నంది విగ్రహం రెండు ముక్కలై, నిర్లక్ష్యానికి గురై ఉందని, అపురూపమైన ఈ శిల్ప కళాఖండాన్ని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోకి తరలించి, ఒక పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాలు తో ఒక పేరు పలకను ఏర్పాటు చేసి, భద్రపరిచాలని జక్లేర్ గ్రామస్తులకు శివనాగిరెడ్డి అవగాహన కల్పించి, విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, జైపాల్ రెడ్డి, నరిటి ఆంజనేయులు, ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *