కలిగిరి లో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి గా బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, జెడ్పీటీసీగా మేటుకురి శిరీషారెడ్డి ఘన విజయం.

కలిగిరి, నవంబర్ 5 మన నెల్లూరు, RC ఇన్చార్జి నాగరాజు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కలిగిరి మండలంలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 9 స్థానాల్లో ఘన విజయం సాధించి తమ హవా కొనసాగించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది.మొదటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక ఎన్నికలు కావడంతో ఇది ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారింది. ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ తరుణంలో ఎంపీపీ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి బిజ్జం వెంకట కృష్ణారెడ్డి కైవసం చేసుకోగా, జెడ్పీటీసీగా మేట్టుకురి శిరీషారెడ్డి ఘన విజయం సాధించారు. మెజారిటీ ఎంపీటీసీలు టీడీపీ కైవసం కావడంతో ఎంపీపీ పీఠం సునాయాసంగా టీడీపీ వశమైంది.13 ఎంపీటీసీ సెగ్మెంట్లలో టీడీపీ 9 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా మండలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. వైసీపీకి కేవలం 4 స్థానాలు మాత్రమే రావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.ఈ విజయంపై కలిగిరి మండల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీపీగా ఎన్నికైన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి కి, 9 మంది ఎంపీటీసీలకు, జెడ్పీటీసీగా గెలుపొందిన మేటుకురి శిరీషారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాన్ని కలిగిరి ప్రజలకు, కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు 1 జెడ్పీటీసీ,09 ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంతో కలిగిరి మండలంలో కూటమి జెండా రెపరెపలాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *