ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.
మన ధ్యాస, మక్తల్:తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు మఖ్తల్ పట్టణంలోని మత్స్య పారిశ్రామిక భవనంలో ఘనంగా నిర్వహించారు. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నేతలు మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల కోసం పండుగ సాయన్న ఎంతో కృషి చేశారని, దొరల గడీలను బద్దలుకొట్టి పేదవాళ్ళకు సంపద పంచి పెట్టారని, ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో పండుగ సాయన్న పై పాటలు పాడుకుంటూ కనిపిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా చేపట్టడం సంతోషంగా ఉందని, కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం డైరెక్టర్లు తిరుపతి నర్సిములు, కర్ని గోపి, ముదిరాజ్ సంఘ నేతలు బైరంపల్లి ముసన్న తాత, మామిళ్ల బుగ్గప్ప, కావలి సాయిలు మేస్త్రి, కాకులారం అశోక్, మామిళ్ల పృథ్వీరాజ్, మామిళ్ల రాము, మామిళ్ల మొగులప్ప, ఈసరి క్రిష్ణ, ఈసరి వెంకటేష్, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.