. మన ధ్యాస, నెల్లూరు. సెప్టెంబర్ 22.ప్రస్తుత సమాజంలో ప్రత్యేక తరహాలో నూతన పరిపాలన విధానాన్ని తీసుకురావాలన్నదే బిసివై పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ జిల్లా ఇంచార్జ్ లీలా మోహన్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జర్నలిస్ట్ భవన్లో మంగళవారం నెల్లూరు జిల్లా మహిళా కన్వీనర్ గా నియమితులైన వల్లభనేని అనిత మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ లీల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ…..ప్రస్తుత రాజకీయ వ్యవహార శైలి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఒకరి అవినీతి గురించి మరొకరు విమర్శనాత్మకంగా మాట్లాడడం జరుగుతుందని దీంతో ప్రజాస్వామ్యం నిరీవీర్యం అవుతుందన్నారు. ఈ క్రమంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఎక్కడ ఏ సమస్య జరిగిన తన దృష్టికి వచ్చిన వెంటనే తాను స్వయంగా ఆయా ప్రాంతానికి వెళ్లి, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఎంతో కృషి చేస్తున్నారని చెప్పుటకు అనేక నిదర్శనాలు ఉన్నాయి అన్నారు. ఈ క్రమంలో మహిళాభ్యుదయంతో పాటు మహిళా సమస్యలను పరిష్కరించే దిశగా, మహిళలు రాజకీయాలలో నాణ్యమైన నమ్మకమైన పరిపాలన అందించాలన్నదే లక్ష్యంగా బీసీవై ముందుకు సాగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు లీలా కృష్ణ యాదవ్, మహిళా అధ్యక్షులుగా వల్లభనేని అనిత, రూరల్ ఇంచార్జ్ అంబటి మురళి యాదవ్, బిసి వై పార్టీ గ్రామీణ నేతలు వెంకటకృష్ణ, రాము ఆధ్వర్యంలో సుమారు వందమందికి పైగా పార్టీ కండువాలు కప్పుకున్నారు.



