తిరుపతి, Mana Dhyasa :- తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మేళతాళాలతో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక కోలాహలంతో తుడా ఆఫీస్ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం వరకు ఘనంగా పాదయాత్ర నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగుల తరపున గంగమ్మ తల్లికి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు, అలాగే గంగమ్మ తల్లి మహాప్రసాదంను ఉద్యోగులందరికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చీర్ల కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మణికంఠ, కోశాధికారి గుంటూరు రేఖ, వర్కింగ్ ప్రెసిడెంట్ గంట భరత్, వైస్ ప్రెసిడెంట్ కొప్పర్తి శివ, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు రమాదేవి, సారిక, మదన్ మోహన్, చిన్నంగారి సూరిబాబు, ఆంజనేయులు, అశోకన్, విశ్వనాధం, మదన్, వెంకటనాగులు, రమణ, శ్రీనివాస మూర్తి, చంద్ర కిరణ్, వాసన్, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, సురేష్, ఈశ్వర్ నాయక్, గుణ, తేజేశ్వర్ రెడ్డి, టి. భరత్, టీటీడీ ట్రాన్స్పోర్ట్, టీటీడీ ప్రెస్, క్యాంటీన్, హెల్త్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
