ఐరాల మన ధ్యాస ఫిబ్రవరి-11: భారత సైన్యంలో చిన్న వయసులోనే చేరి దేశ రక్షణను ధ్యేయంగా చేసుకుని సేవలందించిన చిట్టి బాబు, తరువాత కూడా భారతమాత సేవలో కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ప్రజా సేవను కొనసాగిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా బీజేపీ యువజన విభాగం బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పలు సామాజిక, రాజకీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా, రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు “జై కిసాన్” నినాదాన్ని బలంగా ప్రచారం చేయడం లక్ష్యంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో జై జవాన్ భావనతో సేవలందించిన ఆయన, ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ నియామకం ద్వారా రైతుల సమస్యల పరిష్కారంలో మరింత చురుకైన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది.