చిత్తూరు, మన ధ్యాస ఫిబ్రవరి-09: చిత్తూరు నగర నడిబొడ్డున ప్రధాన కార్యదర్శి ఏ. విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పి.ఆర్.టి.యు సంఘం యాభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే సంఘం పి.ఆర్.టి.యు మాత్రమేనని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. గిరిప్రసాద్ చిత్తూరు నివాసి కావడం జిల్లాకు గర్వకారణమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సి. మోహన్ రెడ్డి, కె. నరేంద్ర రెడ్డి, ఎం. సురేష్ బాబు రెడ్డి, రాష్ట్ర నాయకులు కనకాచారి, భాస్కర్ రెడ్డి, చిత్తూరు అర్బన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఏకాంబరం రెడ్డి, శ్రీమతి రేఖతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా నాయకత్వం పాల్గొన్న అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసింది.