మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ,నామినేషన్ కేంద్రం పరిసరాల్లో 164 బిఎన్ ఎస్ ఎస్(144 సి ఆర్ పి సి) సెక్షన్ అమల్లో ఉందని, 200 మీటర్ల పరిధిలో గుంపులు గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.ఎన్నికల నియమావళిని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, మైక్ వినియోగం చేయరాదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నామినేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలు అమలు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.ఈ బందోబస్తులో ఎస్సై లు భాగ్యలక్ష్మి రెడ్డి, రమేష్, రేవతి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *