ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

చిల్లర నా కొడుకులందరూ కాలేజీకి వస్తుంటారంటూ ప్రిన్సిపాల్ దూషణ. పూర్వ విద్యార్థి, విద్యార్థి సంఘం నాయకుని పై దాడికి యత్నం. కత్తి పోయి డోలు వచ్చ! విద్యార్థులపై ప్రిన్సిపాల్ కర్ర పెత్తనమా?
ఉరవకొండ మన ధ్యాస: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అన్నారు. గురువు దైవంతో సమానం. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఆ గురువే విద్యార్థి పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ, దాడికి యత్నించడమే కాకుండా బండ బూతులు తిట్టారు. చదివిన పత్రాల కోసం ఓ పూర్వ విద్యార్థి, వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘం నేత కళాశాలలోకి వెళ్లగా, ప్రిన్సిపాల్ చిల్లర నా కొడుకులందరూ కాలేజీకి వస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విద్యార్థి సంఘం నాయకుడు అని చెప్పినా ఎవడైతే నాకేంటి రా అంటూ కస్సు బస్సులాడారు. అంతటితో ఆగక దాడికియత్నించారు. గత ప్రిన్సిపాల్ కళాశాలలోకి ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల పట్ల గోడకుర్చీలు తీయించేది. భౌతిక శిక్షలు విధించేది. అయితే ప్రస్తుతం కళాశాలలోకి వస్తే నానా దుర్భాషలాడుతున్నారు. ప్రిన్సిపాల్ వైఖరి కత్తి పోయి డోలు వచ్చే అన్న చందంగా ఉందని విద్యార్థి సంఘం నేతలు తూర్పారబడ్డారు.
ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తిపై విద్యార్థి సంఘం నాయకుడు సోము శేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో దూషించారని, దాడికి యత్నించారని ఆరోపిస్తూ ఆయన అనంతపురం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
ఘటన వివరాలు:
సోము శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, తాను 2021-22 విద్యా సంవత్సరంలో అదే కళాశాలలో వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేశారు. సోమవారం రోజున తన బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్, ఇతర సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్లారు. అక్కడ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్టిఫికెట్లు అందుబాటులో లేవని చెప్పడంతో, తన మెంటార్ లెక్చరర్ వద్దకు వెళుతుండగా ప్రిన్సిపాల్ అడ్డగించారు.
ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి “నువ్వు ఎవడైతే నాకేంటి? చిల్లర నా కొడుకులందరూ కాలేజీలకు వస్తారంటూ” అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని శేఖర్ ఆరోపించారు. అంతేకాకుండా, తనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని తెలిపారు.
న్యాయం కోసం విజ్ఞప్తి:
ఒక పూర్వ విద్యార్థి పట్ల, ముఖ్యంగా విద్యార్థి నాయకుడి పట్ల ప్రిన్సిపాల్ ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని సోము శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి, తనకు అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, కళాశాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related Posts

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి :-ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు…

అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

అనుమతులు లేవంటూ ఆరోపించిన మేకల కృష్ణ… శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రభుత్వం నుండి ఏ విధమైనఅనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ను తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు కు శంఖవరం గ్రామానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్