

మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం ఆగస్ట్-21 ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య అత్యంత కీలకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్.పి. చెంగల్రాయ నాయుడు బీసీ హాస్టల్ భవనం నిర్మాణ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, *“‘పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా సావిత్రమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ చౌదరి, విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి, చుడా ఛైర్మన్ కఠారి హేమలతతో కలిసి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సుమారు రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీసీ హాస్టల్ భవనంకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రైవేట్ రంగం లోని దాతలు ముందుకు వచ్చి చిత్తూరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహం భవన నిర్మాణం చేపట్టడం సంతోషదాయకమన్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది చదువు, జ్ఞానమని నమ్మిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న బిసి బాలికల వసతి గృహ నిర్మాణానికి అనుమతుల మంజూరులో చొరవ చూపడంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న వెంకటేశ్వర చౌదరి, తేజోమూర్తి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్ సౌకర్యాన్ని విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హాస్టల్ లో విద్యార్థులకు చదువుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని, చదువుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసించిన చాలా మంది ఉన్నత స్థాయికి వెళ్లారని, ప్రస్తుతం ఉన్న విద్యార్థులు కూడా శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థులు తమ తమ జీవితాన్ని బంగారుమయంగా మార్చుకునే ప్రయోగశాలగా భావించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, విజయం విద్యాసంస్థల అధినేత తేజ మూర్తి, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి మరియు పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు మరియు పూతలపట్టు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

