

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్..
గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా. ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు,పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను గత వైసిపి ప్రభుత్వం జీవో నెంబర్ 1214 ను ప్రవేశపెట్టి కార్మికులకు అన్యాయం చేసి బోర్డులో ఉన్న 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వ అవసరాలకు దారి మళ్ళించిందన్నారు, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పున ప్రారంభిస్తామని పెండింగ్లో ఉన్న క్లైములకు నిధులు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కార్మికులందరి చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవడం అత్యంత బాధాకరమన్నారు, ఈ విషయమై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం మేరకు తిరుపతి జిల్లా కార్మికులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను పోస్ట్ కార్డులు వేసి తద్వారా కార్మిక సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లి సంక్షేమ బోర్డు సాధించుకోవాలని పిలుపునిచ్చారు, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రారంభించి పెండింగ్లో ఉన్న 46వేల క్లైములకు నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ చిలుకూరు మండల కార్యదర్శి జి రమేష్, సునీల్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మీరా, బాల, మస్తాన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు