

పిఠాపురం జూలై 25 మన న్యూస్ :– పిఠాపురం స్థానిక కోర్టుల ఆవరణలో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు శనివారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలియజేశారు. కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నల్స రూపొందించిన అసంఘటిత కార్మికుల పథకం అమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం కోర్టుల ఆవరణలో లేబర్ ఆఫీసర్ వారి ఏర్పాటు చేస్తున్న స్ట్రాల్ నందు నియోజవర్గంలో గల అసంఘటిత కార్మికులందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని కార్డు పొందగలరు అని అన్నారు. ఈ కార్డు ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంపూర్ణ సామాజిక భద్రత, యూఏఎన్ నెంబర్‌తో కూడిన గుర్తింపు కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుట, ప్రమాదవశాస్తు మరణించిన లేదా అంగవైకల్యం సంభవించిన కార్మికులకు రెండు లక్షల బీమా నగదు ఇవ్వడం జరుగుతుందని జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు, నమోదు జరుగుతుందని, అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.