

అనంతపురం జిల్లా మన న్యూస్: సైబర్ నేట్ల నుండి సురక్షితంగా ఉండటానికి “RTO Traffic Challan.apk” పేరుతో వచ్చే సందేశాలు మరియు లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ లింక్ వైరల్ అవుతోందని, దీన్ని క్లిక్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మోబైల్ ఫోన్లోని సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చేరుకోవచ్చని హెచ్చరించారు.
ఎస్పీ సూచనలు:
- ఏ అనుమానాస్పద లింక్స్ నైనా తొందరపాటు క్లిక్ చేయొద్దు.
- “Traffic Challan” పేరుతో వచ్చే APK ఫైళ్లను ఇన్స్టాల్ చేయకండి.
- అధికారిక RTO/పోలీసు వెబ్సైట్ల ద్వారా మాత్రమే చలాన్ వివరాలు తనిఖీ చేయండి.
సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి ఈ సూచనలను పాటించాలని పోలీసు అధికారులు కోరారు. ఏవైనా అనుమానాస్పద కంటెంట్ గమనించినప్పుడు, సైబర్ క్రైమ్ విభాగానికి రిపోర్ట్ చేయాలని సూచించారు.
హెచ్చరిక: స్కామ్ లింక్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురైతే, ఆర్థిక నష్టం లేదా ఐడెంటిటీ దొంగతనం సంభవించవచ్చు. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి!