

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జరగని లిక్కర్ కుంభకోణంలో ఆధారాలు ఎలా సృష్టించాలో అర్థం కాక సిట్ అధికారుల తలలు పట్టుకుంటారని అన్నారు. ఒక పథకం ప్రకారం స్టేట్మెంట్లు ఆధారంగా ఈ లిక్కర్స్ స్కామ్ ను టీవీ సీరియల్ మాదిరిగా అల్లుకుంటూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అడ్డుకోవాలని అనుకోవడం చంద్రబాబు, లోకేష్ తెలివితక్కువతనమని అన్నారు. ఏడాది పాలనతో వచ్చిన ప్రజా వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని, ప్రజా సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి కూటమ నాయకులు ఓర్వలేక పోతున్నారని, అందుకే మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారని కారణంతో జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని పోలీస్ అరెస్ట్ చేశారని, ఈ శాఖతో ఎంపీ మిథున్ రెడ్డికి గాని, ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిరూపించే ఆధారం కూడా పోలీసులు వద్ద లేదని అన్నారు. కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని అన్నారు. కక్షపూరిత రాజకీయాలతో అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన తాత్కాలిక ఆనందం పొందవచ్చు ఏమో గాని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలను అడ్డుకోలేరన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడిపోతారని అనుకోవడం అవివేకం అవుతుందని అన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పకుండా ఆపలేరని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.