

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రధాన పంటలలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రధాన పంటకు కావలసిన సాగు ఖర్చులను అంతర పంటల ద్వారా పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. సోమవారం నాడు కర్రివలస గ్రామంలో రైతు లండ నారాయణరావు ఎల్ 2 విజయ్ ఆధ్వర్యంలో తన రెండు ఎకరాల పత్తి క్షేత్రంలో వేస్తున్న పెసర,మినుము అంతర పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ అక్కడక్కడ చిక్కుడు మరియు గోంగూర బెండ వేస్తూ చుట్టూ ఆనప మరియు బీరపాదులను పెట్టడం వలన ఒక నెలలోనే నాలుగు వేల రూపాయలు అదనపు ఆదాయాన్ని పొందగలిగానని చెప్పారు. ఇప్పుడు పత్తి వరుసల మధ్య పెసర మినుము మరియు చోడి పంటలను వేస్తున్నానని తెలిపారు.చుట్టుపక్కల సుమారు పదిమంది రైతులు ముందుకు వచ్చి పది ఎకరాలలో పత్తిలో అపరాలు అంతరపంటగా వేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అంతర పంటల వలన అధిక ఆదాయం రావడమే కాకుండా భూమిలో వివిధ రకాల వేరు వ్యవస్థలు ఉండడం వలన ప్రధాన పంటకు అనేక రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మిత్రపూరు గల సంఖ్య పెరిగి చెడ్డ పేడల ఉధృతి ఘనంగా తగ్గుతుందని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కనీస గ్యారెంటీ దిగుబడి ఏదో ఒక పంట ద్వారా అందుతుందని మనము వేసే ఎరువులు ఇతర పోషకాలు అన్ని వృధా కాకుండా వినియోగించబడతాయనితెలిపారు. కాబట్టి రైతులు ఏకపంట విధానాన్ని విడిచి అంతర్పంటలు బహుళ పంటలు విధానాలకు మల్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంటి యశోదమ్మ ఐ సి ఆర్ పి సుమలత తదితరులు పాల్గొన్నారు.
