కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి..ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారు

సూపర్ సిక్స్ పథకాల అమలు పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్…కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారనీ వారు తెలిపారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల అమలు పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం.., ఎస్. ఆర్. పురం మండలం, కటిక పల్లెలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు.., ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. అంతకు ముందు.. కటిక పల్లెకు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎస్. ఆర్. పురం మండలాధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు నేతృత్వంలో… , బాలాజీ నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా.., గజమాలలతో ఘనంగా స్వాగతం పలికగా.., ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్… కూటమి శ్రేణులతో కలిసి సుపరిపాలాలు తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కటికపల్లెలోని ప్రతి గడప కెళ్ళి,.. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంచుతూ.., ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యలను తక్షణం అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. అవ్వా తాతలు, ప్రత్యేక ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితులు, డప్పు కళాకారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు సక్రమంగా అందజేస్తున్నారా లేదా..? అన్న విషయాన్ని వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అవ్వలతో కూర్చొని కూటమి ప్రభుత్వం పని తీరు ఎలా పనిచేస్తుంది..! ఏమైనా లోపాలున్నాయీ..! అని ఆ వయోవృద్ధులను అడగగా..అందుకు వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ మాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అనంతరం ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ… ఏడాది పాలనలో తాము చేసిన పనులు ప్రజలకు ఏ మేరకు దోహదపడ్డాయో అన్న విషయాలను స్వయంగా తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా తమకు ఇస్తున్న గౌరవాన్ని బాధ్యతగా భావిస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజల ఆశీస్సులతో.., ప్రజల ఆశయాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ.., గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాజశేఖర్ నాయుడు , బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్ ,యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, సాఫ్ట్వేర్ బాలు బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, కటిక పల్లి మాజీ సర్పంచులు బాబు నాయుడు, దీప బుజ్జి ,మాజీ ఎంపీటీసీలు వేమా నాయుడు, కే.యం.రవి టిడిపి యువ నాయకుడు పైనేని మురళి, బి కే ఎన్ మునివర్ధనాయుడు మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి శేఖర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ డీకే మర్రిపల్లి టిడిపి యువ నాయకుడు నరేష్ ప్రసాద్, బూత్ కమిటీ ఇన్చార్జ్ మాధవ నాయుడు, యువత ప్రధాన కార్యదర్శి బాబు, నోమేష్ రెడ్డి లోకయ్య ఢిల్లీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాయినాధుని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతుపాలెం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సిబిఎన్ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీశ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది