గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్ దొండపాటి లోవతల్లి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కు అందరు కృషి చేయాలని జడ్పీటీసీ నాగలోవరాజు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు తుమ్మలపల్లి ఈశ్వరరావు, ఇసరపు రామకృష్ణ, వార్డు సభ్యులు ఓరుగంటి ప్రసాద్,సోమరౌతు సూర్యనారాయణ, దేవర కృష్ణ, చల్లా విష్ణు, జిల్లా నాయకులు కర్రి రాంబాబు, మండల మహిళా అధ్యక్షురాలు కండవల్లి జ్యోతి, విద్యా కమిటీ మాజీ చైర్మన్ లు వులవకాయల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు మల్లిపూడి గంగాధర్, సూరిబాబు, ఓరుగంటి రవి, మంగం అర్జున్, నూజివీడు నాగేశ్వరావు, వులవల మణికంఠ, బదిరెడ్డి కృష్ణ, బండారు బాబ్జి, సోమరౌతు అప్పన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *