

మన న్యూస్ సాలూరు జూలై 3:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కూనేటి శ్యామల 45 సం” ను వాంతులు విరోచనాలు జ్వరం అపస్మార్క్ స్థితిలో ఉన్న ఆశా కార్యకర్తను కుటుంబ సభ్యులు డోలి కట్టి కొండలు, గుట్టలు సువర్ణముఖి నది దాటుకొని కురుకూటి వరకు సుమారు 5 కిలోమీటర్లు తీసుకొని రావడం జరిగింది అక్కడినుండి సాలూరు సాలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొని రాగా వైద్య సేవలు అందించడం జరిగింది ఆమెను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సుర్రు రామారావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ సందర్భంగా
మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీలు మోత లేకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రకటనలు చేశారని తెలిపారు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప గిరిజన ప్రాంతంలో రోడ్లు మౌలిక సదుపాయాలు లేవువని తెలిపారు కూరుకుటి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కోరుతున్న ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని తెలిపారు మండలంలో డోలీలు మోత లేకుండా అన్ని గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూటము ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.