మన న్యూస్ పాచిపెంట, జూన్ 21:- 25 కిలోల 32 రకాల నవధాన్య విత్తనాలను ఒక ఎకరానికి వేసి 40 రోజుల తర్వాత కలియదున్ని అనంతరం మొక్కజొన్న,వరి మరియు పొగాకు పంటలను వేస్తే నవధాన్యాల భూసార ఫలితం ఆయా పంటలపై ఎలా ఉంటుందో తెలుసుకునే సరికొత్త ప్రయోగాన్ని పాంచాలి గ్రామంలో రైతు సేనాపతి భాస్కరరావు పొలంలో చేయడం జరిగిందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన శనివారం నాడు మాట్లాడుతూ నవధాన్యాలు భూసారాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వరుసగా మూడు సీజన్ల పాటు నవధాన్యాలను సాగు చేసి కలియ దున్నిన అనంతరం మొదటి సంవత్సరంతో పోలిస్తే మూడవ సంవత్సరం భూమిలో సేంద్రియ కర్బనం శాతం ఎంత పెరిగింది ప్రతి సంవత్సరం దిగుబడులు ఎంత పెరిగాయి రసాయన ఎరువులపై భారం ఎంతవరకు తగ్గుతుంది పంట చెడిపేడలను తట్టుకునే స్వభావం ఎంతవరకు మెరుగుపడుతుంది సాగు ఖర్చులు తగ్గి పంట నాణ్యత ఎంతవరకు పెరుగుతుంది అన్న విషయాలపై అధ్యయనం చేస్తామని రైతులకు క్షేత్రస్థాయిలో క్షేత్ర దినోత్సవాలను పెట్టి ఫలితాలను వివరిస్తామని తెలిపారు రాబోయే రోజులలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీను మరియు ప్రకృతి సేద్య క్లస్టర్ ఎల్ వన్ తిరుపతి నాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *