ఘన స్వాగతం పలికిన బుద్ధ బ్రదర్స్ మరియు ఆలయ కమిటీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుచున్న గుబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకి సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్,ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు,యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు ఘన స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సత్యప్రభని సన్మానించి తీర్ద ప్రసాదాలు అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గుబ్బాలమ్మ అమ్మవారి 12 వ జాతర మహోత్సవం సందర్బంగా కుంకుమ పూజలు,కోలాట నృత్యాలు,వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పెదకంశెట్టి గోవిందరావు,బుద్ధ నానాజీ,బుద్ధ నాగభూషణం,బొడ్డేటి వినోద్, దాడి గంగాధర్,బూర అనూష,కాళ్ళ రామకృష్ణ,మళ్ళ పార్వతయ్య, కోడెల మురళీ తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *