మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇటీవల ప్రమాదానికి గురైన రిపోర్టర్ దొడ్డి శ్రీనివాసును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వకర్త మేడిశెట్టి సూర్య కిరణ్(బాబి)ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన శ్రీనివాసుని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.దొడ్డి శ్రీనివాస్ గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని ఇటీవల ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సూర్య కిరణ్ తో పాటుగా శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, బీజేపీ నాయకులు వెలుగురి హరేరం,జనసేన నాయకులు అచ్చే వీరబాబు,వజ్రంగి శ్రీను,సింగలూరి నాని,రాకేష్,సిస్ట సుబ్రహ్మణ్యం,సిస్ట శివ,సాల వీరబాబు,తెలుగుదేశం నాయకులు చిలకమర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *