oplus_8192

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం చిలమాకులపల్లి పంచమా మహాభారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్యోధన వద ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించారు. భీముడికి భయపడి దుర్యోధనుడు గంగమడుగు లో దాకుంటాడు. శ్రీకృష్ణుని సహాయంతో గంగమడుగు లో దాక్కునున్న దుర్యోధనడుని భీముడు వధిస్తాడు. భీమ దుర్యోధన పద్యాలు పాడుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దుర్యోధన వద కార్యక్రమానికి ఉభయదారులు గా ముదికుప్పం సర్పంచ్ సీనయ్య వ్యవహరించారు.సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం చేసి ద్రౌపతి, ధర్మరాజుల ఉత్సవమూర్తులను గ్రామాల్లో ఊరేగింపు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లోకనాథం రెడ్డి, ఆలయ నిర్వాహకులు నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు చిరంజీవి రెడ్డి సతీష్ రెడ్డి శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *