వరికుంటపాడు జూలై 02 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

వరికుంటపాడు మండలం డక్కనూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కూండ్ల రంగయ్య దశదినకర్మ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూండ్ల రంగయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రంగయ్య ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని బొల్లినేని వెంకట రామారావు కొనియాడారు.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *