గొల్లప్రోలు జూన్ 1 మన న్యూస్. : కొడవలి, చిన్న జగ్గంపేట గ్రామాల్లో రేషన్ షాపు లు ఘనంగా ప్రారంభమయ్యాయి.నిత్యవసర పంపిణి లో ఉమ్మడి కూటమి నాయకులు లందరూ పాల్గోని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు వివరించారు.పార్టిలతో ప్రమేయం లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఎంపిటిసి లు పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.ప్రతినెల 1 వతేదినుండి 15 వతేదివరకు రేషన్ పంపిణి జరుగుతుందని వివరించారు.రేషన్ షాపు నుండి ఎవరైనా సరుకులు తీసుకుని వెళ్ళలేని స్థితిలో ఉంటే సమాచారం తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్, కుక్కా మురళి,మద్దాల రామకృష్ణ, ముప్పును బోయిన మణియ్య,కుక్కా నాగశ్రీను, గింజలా నాగేశ్వరరావు,బద్దా భగవాన్,నక్కానారాయణ మూర్తి,నక్కా బద్రీ,,పల్లా ఏసుబాబు తదితర వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *