పాడేరు 12వ మైలు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

Mana News :- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘పాడేరు 12వ మైలు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ… నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్ గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను.జూన్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది, సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాము. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెంస్ అండ్ లవ్ ఎలెమెంట్స్ తో రాబోతోంది, మాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు. నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ… పాడేరు 12వ మైలు సినిమా బాగ వచ్చింది, డైరెక్టర్ , యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది, శ్రీ పాడేరు మొదకొండమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మా పై ఎప్పుడూ ఇలానే ఉండాలని, ప్రేక్షకులు, మీడియా వారు మా సినిమాను తప్పకుండా పాజిటీవ్ గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది, ఇదివరకు మేము విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, సినిమా కూడా నచ్చుతుందని నమ్మకంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ శివ శర్వాని అలాగే సినిమాటోగ్రఫీ జి. అమర్ అందిస్తున్నారు ఈ మూవీ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్త, కె.ఏ.పాల్ రాము, సూర్య, సమీర్, చిట్టిబాబు, మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. హైదరాబాద్, వైజాగ్ మరియు పాడేరు లో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పీఆర్ నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి