తుడ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది… వైసిపి రూరల్ మండలం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి.

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మునీశ్వర్ రెడ్డి మాట్లాడారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి నియోజకవర్గం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ నిధులను వెనక్కి ఇవ్వమని ఈశ్వర్ రెడ్డి అడుగుతారా అని ప్రశ్నించారు. రేణిగుంటలో కూడా కూడా నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో రెండు కోట్లతో ఆరనియర్ పార్కును తుడా నిధులతోనే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తుడా నిధులతో 11 పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండా 12 ఇండోర్ స్టేడియం లను నిర్మించడం జరిగిందన్నారు. తుమ్మలగుట్ట లోని కె.వి.ఆర్ పార్కు గురించి తాము మాట్లాడినప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉలిక్కి పడ్డారని ఈశ్వర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుమ్మలగుంటలో పార్కును గ్రామపంచాయతీ లోని అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పంచాయతీ ప్రజలకు పూర్తి హక్కులు దానిపై ఉన్నాయన్నారు. పార్టీలకతీతంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గమంతా అభివృద్ధి చేశారని చెప్పారు. ఇకనైనా ఈశ్వర్ రెడ్డి తో పాటు తిరుపతి రూరల్ మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని, తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ మండలాధ్యక్షులు మూలం చంద్రమోహన్ రెడ్డి, రూరల్ మండలం వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, పేరూరు సర్పంచు దామినేటి కేశవులు, వెంకటపతి నగర్ సర్పంచ్ చిన్ని యాదవ్ పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///