

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 14: *నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర. *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ మహోత్సవం.*ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం ఆనాడు 60 రోజుల ముందు ప్రజల చేత శంకుస్థాపనలు * నేడు ప్రజల సాక్షిగా పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు*ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే మే 15వ తేదీన ఉదయం 09:00 గం.లకు ఒకేరోజు ఒకే సమయానికి 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు ఉండే విధముగా ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టడం జరుగుతుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 24వ డివిజన్, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మునిసిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర పాల్గొంటారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అన్నారు. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనాయకుడు నారా లోకేష్ కి, ఓటువేసి 3వసారి ఎమ్.ఎల్.ఏగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, కష్టం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
