

మన న్యూస్,తిరుపతి, : ఇండియన్ ఆర్మీలో ఇప్పటివరకు తమ వద్ద శిక్షణ తీసుకున్న 6 వేల మంది యువతను చేర్పించడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి. శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం బి ఎస్ ఆర్ విద్యాసంస్థలను ప్రారంభించడం జరిగిందన్నారు. సుమారు 20,000 మంది విద్యార్థులకు విద్య తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా సిబిఎస్ ప్రమాణాలతో మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల క్రితం వెరిటాస్ సైనిక్ స్కూల్లో ప్రారంభించడం జరిగిందన్నారు. తమ సైనిక్ స్కూల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలతో పాటు శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం మానవీయ విలువలతో కూడిన విద్యను అందించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూల్లో అనుసంధానంతో కరికులం ఆక్టివిటీస్ మరియు కాంపిటీషన్స్ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 50% అడ్మిషన్లను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ నుండి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దేశానికి సేవ చేసేందుకు అతను ఆర్మీలో ఎన్డీఏ టీఎస్ లాంటి ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలను కేవలం 17 సంవత్సరాల వయసులోనే యువతకు కల్పిస్తున్నామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి దేశం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతున్నారని చెప్పారు. అనంతరం వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి శ్రీకర్ రెడ్డి, బి సందీప్ రెడ్డి లు మాట్లాడుతూ వెరిటాస్ సైనిక్ స్కూల్ ను ప్రారంభించి ఐదు సంవత్సరాలు అవుతుందని, క్రమశిక్షణతో పాటు మెరుగైన విద్యా బోధనలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా తమ విద్యాసంస్థ పని చేస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేక అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోందని పేర్కొన్నారు. కొత్త 22 సంవత్సరాలుగా తమ విద్యా సంస్థల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు , అధ్యాపకులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, వెరిటాస్ సైనిక్ స్కూల్ పిఆర్ఓ బాబి కూడా పాల్గొన్నారు.