

Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”
ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరూతున్న . దేశ ప్రజల ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పార్టీల నాయకులు తోడ్పాటుగా నిలవాలని శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కోరారు. జమ్ము కాశ్మీర్ పహేల్గావ్ లో ఉగ్రవాదుల దాడిలో పలువురు పర్యాటకుల మరణం పట్ల గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్యను బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి ఖండించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలనీ కేంద్రాన్ని కోరారు. జమ్ము కాశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయి శోకతప్తులైన వారి కుటుంబాలకు గౌరవ శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి గారు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తన సానుభూతిని వ్యక్తం చేశారు.