

మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి:ఆరెపల్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు శుక్రవారం సాయంత్రం బండరామేశ్వరపల్లి వాగు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మాచారెడ్డి మరియు పాల్వంచ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా అక్రమంగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్య తీసుకొనబడును.అదేవిధంగా ఎవరైనా అక్రమంగా అనుమతి లేకుండా ఇసుక తరలస్తున్నట్టయితే 100 డయల్ కి కాల్ చేసి తెలుపగలరు అని అన్నారు
