ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ బడ్జెట్ సెషన్ నుండి అక్రమంగా సస్పెన్షన్ విధించినందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వ మరియు CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

మనన్యూస్,కామారెడ్డి:మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ గార్ల ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా BRS పార్టీ అద్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ మరియు CM రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది దిష్టి బొమ్మ దహన కార్యక్రమం అనంతరం BRS పార్టీ నాయకులు మాట్లాడుతూ MLA జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వారి మాయమాటలను ఎండగడుతూ మాట్లాడినందుకు MLA జగదీశ్వర్ రెడ్డి పై విదించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లోని 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీని వారి ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించడం జరిగింది ఇట్టి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు పిప్పిరి అంజనేయులు, జూకంటి ప్రభాకర్ రెడ్డి, గట్టగోని గోపిగౌడ్, గెరిగంటి లక్ష్మినారాయణ, కుంబాల రవి యాదవ్, బల్వంత్ రావు, మల్లేష్ యాదవ్, చెలిమెల భాను ప్రసాద్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *