తవణంపల్లి, మార్చి 9 మన న్యూస్
మండలలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 - 86:వ సంవత్సరం 10 వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్ళై, ఎల్ కృష్ణారెడ్డి సుందరరాజులు, జగత్ జ్యోతిశ్వరరెడ్డి, వెంకటస్వామి, బాబుసాహెబ్, కృష్ణమూర్తినాయుడు, రాజేశ్వరి, లోకేశ్వరి, శ్రీదేవి, మొగిలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్లై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను బాగా చూసుకున్న రోజే వారి చదువులకు సార్థకత అవుతుందన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెడుదారి పట్టకుండా చదివించుకుని, వారి అభివృద్ధికి పాటు పడాలన్నారు. ముఖ్యంగా తమ పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలువురు పూర్వ విద్యార్థులు ప్రసంగించారు. 39 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడం సంతోషాన్నిస్తోందన్నారు. అదే క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఎదిగేందుకు అన్ని విధాల సహకరించిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి కోరిక మేరకు పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సాయం చేస్తామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు చివరగా కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులను దృశ్యాలవులతో ఘనంగా సన్మానించి కానుకలు అందజేశారు. అంతకుముందు ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేసి నా పూర్వ విద్యార్థులు ఒకరు ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ గత స్మృతులను నెమరువేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు కేబీ ఉమాపతి, పి రామకృష్ణ, ధర్మేంద్ర, జయంతిరెడ్డి, మన్నారు ప్రసాద్, కుమార్ నాయుడు, రెడ్డిప్రసాద్, మాధవి, కమలాపతి, సుకుమార్, పూర్ణచంద్ర, శ్రీనివాసులుతో పాటు దాదాపు 200 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.