

మనన్యూస్,ఎల్ బి నగర్:గౌట్ ప్రెస్ కాలనీ పార్కులో,భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా యోగ సెంటర్ ప్రెస్ కాలనీ చీఫ్ఎ ల్.మాధవరెడ్డి,సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డి, అధ్యక్షతనలో నిర్వహిస్తున్న,
యోగ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్బంగా యోగ శిక్షకురాలు కాయితీ విజయలక్ష్మి, దువ్వ సాయి కుమారి,మాట్లాడుతూ.సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. అందుకే ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీన ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం.మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని వారిని వారు ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం, ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ.మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.. భారత దేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణి రుద్రమదేవి, భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్ట మొదటి మహిళ కల్పనా చావ్లా, ఇలా ఎందరో మహిళలు భారతదేశానికి స్ఫూర్తి దాయకంగా నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో యోగ సాధకురాలు పాల్గొన్నారు.
