మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:పాల్వంచ మండలం పాత పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలను ఆకస్మికంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.విద్యార్థులతో భోజనం చేస్తూ కలెక్టర్ వారితో మమేకమై వారి బాగోగులను,భోజనం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడగాలని ఆయన సూచించారు. ఆహారాన్ని వదిలివేయరాదని,చక్కని ఆరోగ్యానికి ఆహారం సహకరిస్తుందని ఆయన చెప్పారు.పౌష్టిక ఆహారం పట్ల అవగాహన పెంచుకోవాలని,పౌష్టికాహారాన్ని ముఖ్యంగా బాలికలు విధిగా తీసుకోవాలని కలెక్టర్‌ బోధించారు. ఆహార పదార్థాలను వృధా చేయరాదని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు.ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను బాగా గ్రహించాలని అందుకు ఏకాగ్రత అవసరమని కలెక్టర్‌ అన్నారు.పాఠ్యాంశాలలో సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు.అనంతరం అధికారులతో మాట్లాడుతూ వంట వండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు.మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు.చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పాఠశాలకు మంజూరైన స్పోర్ట్స్ మెటీరియల్ కిట్లను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలను సరళతరం చేసేందుకు, అనుకూలంగా భోజనం చేసేందుకు వీలుగా కిచెన్ సెట్,ఐరన్ పొయ్యి ఏర్పాటు,బల్లలు, బెంచీలు,విద్యార్థులకు ప్రత్యేకంగా లంచ్ బాక్స్ తో కూడిన బ్యాగ్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి,నివేదికలు అందించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,జిల్లా కోఆర్డినేటర్ సైదులు,సతీష్ కుమార్,ఎంఈఓ రామ్మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు పద్మలత,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///