

మనన్యూస్,తిరుపతి:తిరుమల శ్రీవారి కళ్యాణ కట్ట లో భక్తులకు తలనీలాలు తీసే అవకాశం నాయి బ్రాహ్మణులకు శ్రీవారి సేవ కింద అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కలసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ ఛాంబర్ లో బిఆర్ నాయుడును కలసి నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు,నాయి బ్రాహ్మణ సేవా సంఘం తిరుపతి నగర అధ్యక్షులు సిబ్యాల సుధాకర్,నాయి బ్రాహ్మణులు కలసి వినతి పత్రం సమర్పించారు. అందుకు టిటిడి చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.అనంతరం ఆవులపాటి బుజ్జిబాబు,సిబ్యాల సుధాకర్ లు మీడియాతో మాట్లాడారు.శ్రీవారి కళ్యాణ కట్టలు 2012 సంవత్సరం నుండి శ్రీవారి సేవ కింద 900 మందిని తీసుకొని వారంతా శ్రీవారి సేవ కింద తలనీలాలు తీస్తున్నారని పేర్కొన్నారు.రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ వారి దర్శనానికి రోజుకు లక్ష కు మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తిరుపతిలో శ్రీవారి సేవ కోసమే ఎదురుచూస్తున్నారని,తిరుపతిలో 150 మంది దాకా ఉచితంగా శ్రీవారి సేవ కింద ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు.కావున శ్రీవారికి సేవ చేసుకునే అవకాశాన్ని తమ నాయి బ్రాహ్మణులకు కల్పించాలని వారు టీటీడీ చైర్మన్ కు విన్నవించుకున్నారు.భక్తులకు శ్రీవారి సేవాభావముతోనే ఎటువంటి లాభాపేక్ష లేకుండా కళ్యాణ కట్టల్లో శ్రీవారి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రమాణం చేశారు.కావున టిటిడి చైర్మన్,పాలక మండలి సభ్యులు,ఈవో,జేఈవో ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు శ్రీవారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నామని చెప్పారు.
