

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ కౌడ చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సోమవారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుని నియోజకవర్గంలో జనసేన నాయకులతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పండుగల జరుపుకునే జనసేన పార్టీ ఆవిర్భావ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేసి కేంద్ర స్థాయిలో మన పార్టీ బలాన్ని జనసేన నాయకుల సత్తని చాటిచెప్పే విధంగా పనిచేయాలని జనసేన నాయకులుకు పిలుపునిచ్చారు.అదేవిధంగా జనసేన పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పిస్తారని,పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఏటువంటి ఇబ్బందులు పడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ సమన్వయకర్తలు అత్తి సత్యనారాయణ,నల్లం వాసు, నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చోడిశెట్టి గణేష్ తొండంగి మండలం అధ్యక్షుడు,సోమిశెట్టి వీర్రాజు నాయుడు,బోనం వీర వెంకట సత్యనారాయణ చినబాబు,దండెం రామకృష్ణ జనసేన వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు