

బంగారుపాళ్యం మార్చ్ 03 మన న్యూస్
బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామిమహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా పదో రోజు సోమవారం అత్యంత వైభవంగా పుష్పల్లికి సేవ నిర్వహించారు.ఈసేవకు ఉభయదారులుగా బొమ్మాయిపల్లికి చెందిన ఈశ్వర్ నాయుడు,నలగాంపల్లి కళ్యాణ్ లు వ్యవహరించారు. వాహనానికి ప్రత్యేక పూలతో అలంకరించి స్వామి అమ్మవార్లను మేళతాళాలతో, మంగళ వాయిదాలతో, బాణసంచా వేడుకల మధ్య నాలుగు మడ వీధుల్లో

ఊరేగించారు.అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆలయ కార్య నిర్వహణ అధికారి మునిరాజు,వంశపార ధర్మకర్త ఎంబి విజయకుమార్,ఆలయ అర్చకులు భక్తులకు దండపాని గురుకుల్,రెడ్డప్ప గురుకుల్, సోమేశ్వర గురుకుల్, అష్టరేశ్వర గురుకుల్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు జెసిపి శివ,జెసిబి నరేంద్ర,బుజ్జి నాయుడు, మాధవ నాయుడు,సూరి నాయుడు,మధు నాయుడు, పోలీసు సిబ్బంది ఏఎస్ఐ మల్లప్ప తదితరులు Observation.
