“ధూం ధాం” సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా సకుటుంబంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

ప్రొడ్యూసర్ రామ్ కుమార్ మాట్లాడుతూ

  • “ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేటర్స్ లోకి వెళ్లిన వాళ్లంతా ఎంటర్ టైన్ అవుతున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడియెన్స్ థియేటర్స్ కు వెళ్తున్నారు. ఒక థియేటర్ లో కామన్ ఆడియెన్స్ తో కలిసి హీరో చేతన్ సినిమా చూశాడు. వారు మూవీని బాగా ఎంజాయ్ చేయడం గమనించి హ్యాపీగా ఫీలయ్యాడు. సినిమా పూర్తయ్యాక ఆడియెన్స్ చేతన్ ను గుర్తుపట్టి అభినందించారు.
  • “ధూం ధాం” సినిమాతో చేతన్ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గతంలో తను చేసిన ఫస్ట్ ర్యాంక్ రాజు, రోజులు మారాయి వంటి మూవీస్ యూత్ ఓరియెంటెడ్ గా ఉంటాయి. ఫస్ట్ టైమ్ చేతన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో చేశాడు. కమర్షియల్ గా ప్రయత్నించాడు. సక్సెస్ ఫుల్ హీరోలంతా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసిన వాళ్లే. చేతన్ కూడా అలాగే పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా ఫిలింమేకర్స్ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అనుకుంటే చేతన్ బాగా సెట్ అవుతాడని భావిస్తారు.
  • ఈ రోజుల్లో థియేటర్స్ కు జనం పెద్దగా రావడం లేదు. మేము ఆశించినంత కలెక్షన్స్ లేకున్నా సంతృప్తికరంగానే వసూళ్లు ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఆకర్షించేలా వీలైనంత ప్రమోషన్ చేస్తున్నాం. మా సంస్థలో నెక్ట్ మూవీని మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాం. బయట హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశం లేదు. చేతన్ తోనే మా నెక్ట్ మూవీ ఉంటుంది.

రైటర్ గోపీ మోహన్ మాట్లాడుతూ

  • “ధూం ధాం” సినిమా ఫస్టాఫ్ లో మంచి పాటలు, సెకండాఫ్ లో కామెడీ ఉండాలని ప్లాన్ చేశాం. మేము అనుకున్నట్లే సాంగ్స్ కు , కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ మూడు రోజులు యూత్ ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు. ఈరోజు నుంచి ఫ్యామిలీస్ మా మూవీకి బాగా వస్తారని ఆశిస్తున్నాం.
  • అమెరికాలో ఈ మూవీ షూటింగ్ చేయాల్సింది, అయితే వీసాలు రాని కారణంగా పోలెండ్ లో చిత్రీకరణ జరిపాం. సెకండాఫ్ లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే బాగుంటుందని క్యారెక్టర్స్ కు తగినట్లు తీసుకున్నాం. వెన్నెల కిషోర్ దూకుడు ముందు నుంచీ పరిచయం. అతని పైనే ఈ సినిమా సెకండాఫ్ వెళ్లింది. తన క్యారెక్టర్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
  • కొడుకు ప్రేమించే తండ్రి, తండ్రిని బాగా గౌరవించే కొడుకు..ఇది మూల కథ అయితే…ఒక హుక్ పాయింట్ లా ఉంటుందని హీరోయిన్ వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుందని పృథ్వీ క్యారెక్టర్ తో చెప్పించాం. సినిమా సరదాగా రన్ అవుతున్నా, ఆ క్యారెక్టర్ చెప్పిన పాయింట్ ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పృథ్వీ క్యారెక్టర్ ని చివరలో తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నా…ప్రాక్టికల్ గా కుదరలేదు.
  • ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు, హీరో చేతన్ ఇద్దరూ కామెడీ మూవీ లవర్స్. వాళ్లు ఇప్పటిదాకా చేసింది హాఫ్ బీట్ సినిమాలే అయినా ఎంటర్ టైనింగ్ మూవీస్ ఇష్టపడతారు. “ధూం ధాం” స్క్రిప్ట్ కోసం చాలా డిస్కషన్స్ చేసి వర్క్ వుట్ చేశాం. నేను స్క్రిప్ట్ చేసిన మూవీస్ లో డ్రింకింగ్ సీన్స్ తో మంచి కామెడీ వచ్చింది. అలా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో మన లెజెండరీ నటుల డైలాగ్స్ తో ఓ సీన్ చేశాం. ఈ సీన్ కు థియేటర్ లో హిలేరియస్ గా రెస్పాన్స్ వస్తోంది.
  • నా నెక్ట్ మూవీ గల్లా జయదేవ్ గారి రెండో అబ్బాయితో ప్లాన్ చేస్తున్నా. నా డైరెక్షన్ లోనే ఆ సినిమా చేస్తాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
  • Related Posts

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం, హర్షిత హీరో–హీరోయిన్లుగా ‘జోష్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘మై లవ్’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు ఊట్కూర్ బలరాజ్.

    బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు ఊట్కూర్ బలరాజ్.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.