

మనన్యూస్,పినపాక:మండలం లోని విప్పల గుంపు పాఠశాల నందు మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ వారు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు,ఐదవ తరగతి లో ప్రవేశ పరీక్ష వ్రాయు విద్యార్థులకు బుధ వారం మహర్షి స్వచ్ఛంద సంస్థ వారు స్టడీ మెటీరియల్ ను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కే నాగయ్య పాల్గొని ప్రసంగించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో పెద విద్యార్థులకు ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ ను అందించడం అభినందనీయం అని అన్నారు.సమాజానికి ఉపయోగపడే సేవలు స్వచ్ఛందంగా చేస్తున్న మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు తోలే శ్రీనివాస్ రావు కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ యొక్క స్టడీ మెటీరియల్ ను బాగా చదివి గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షలో వత్యంత ప్రతిభ కనబరిచలని ఆయన పేర్కొన్నారు.ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులను ఐదవ తరగతి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్న తొలెం శ్రీనివాస్ రావు ను మండల విద్యాశాఖ తరుపున సన్మానం చేశారు స్టడీ మెటీరియల్ను కిస్టారం, కొత్తూరు, అమరారం,, విప్పల గుంపు పాఠశాలల విద్యార్థులకు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాంగోపాల్,డి ఆర్ పి లు శ్రీకాంత్,రాజేష్ లు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు,లచ్చు,జమామూర్తి,ప్రశాంత్,సిఆర్పిలు పాపారావు, సాంబశివరావు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు