

మనన్యూస్,పినపాక:ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహదారుల ఆర్సి,కాలుష్య నిర్ధారణ,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండేలా చూసుకోవాలని బైక్ పై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని,పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని,మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని ఎస్ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.