మనన్యూస్,పినపాక:మండలం లో గల సీతo పేట గ్రామానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వరా దేవస్థాన ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.బుదవారం దేవస్థానంలో సమావేశమైన సభ్యులు తొలుత పలు అభివృద్ధి అంశాలపై శివరాత్రి మహోత్సవం గురించి చర్చించారు.అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా బండారు నరేంద్ర,కొండేరు వెంకటేశ్వర్లు,గౌరవ అధ్యక్షులుగా అరే శంకరయ్య ప్రధాన కార్యదర్శి గా బండారు రామ చందర్ రావు,కోశాధికారిగా అరే లెనిన్ ప్రసాద్,కొండేరు కృష్ణ మూర్తి 16 మంది సభ్యులుతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర,కొండేరు వెంకటేశ్వర్లు సంయుక్తంగా మాట్లాడుతూ రాబోయే శివరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు.ఆలయ అభివృద్ధి కొరకు మా శక్తి మేరకు కృషి చేస్తాం అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో శ్రీ రాజ రాజేశ్వరా ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర,కొండేరు వెంకటేశ్వర్లు,అరే శంకరయ్య,బండారు రామ చందర్ రావు, లెనిన్ ప్రసాద్,కృష్ణ మూర్తి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *