మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( సిహెచ్ సి ) సూపరిండెంట్ డాక్టర్ శైలజ మేడం కి ఉత్తమ సేవా అవార్డు వరించింది. ఈ సందర్భంగా, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు లు డాక్టర్ శైలజ ను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కష్టపడి పనిచేసే వారికి అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చి వరిస్తాయని, డాక్టర్ శైలజ పేషెంట్లను ఎంతో బాగా ట్రీట్ చేస్తారని, ఈ అవార్డుకు ఆమె వందకు వంద శాతం అర్హురాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి ల తోపాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *