

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ చలమయ్య మెదడు కు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ , కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు , ఏలేశ్వరం టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పైల అయ్యప్ప, ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్ తదితరులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ, సీనియర్ రాజకీయ నాయకులైన అలమండ చలమయ్య ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఆకాంక్షించారు.