

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామం వద్ద
ఏలేరు జలాశయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో
సుమారు 1,38,600 కట్ల,రోహు, మృగాలా వంటి మేలు జాతి నాణ్యమైన చేప పిల్లలను ఎస్సీ, ఎస్టీలకు 60% సబ్సిడీతోను,బీసీలకు 40 శాతం సబ్సిడీతోను మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ సందర్బంగా జిల్లా మత్స్యశాఖ అధికారి కె కరుణాకరరావు చేప పిల్లలను విడుదల చేసిస్ మాట్లాడుతూ రిజర్వాయరులో మత్స్య సంపదను పెంచుట ద్వారా లైసెన్సుడ్ మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉంటూ వారి జీవన ప్రమాణాలు పెంచుకొనుటకు తోడ్పడుతుందని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు ఎన్ఎఫ్డిపి గుర్తింపు ప్రొవిజనల్ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.మండల అభివృద్ధి అధికారి కె.వి సూర్యనారాయణ మాట్లాడుతూ మత్స్యశాఖ తరపున అందించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందంజ వేయాలని,అభివృద్ధి పథంలో నడవాలని మత్స్యకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఎఫ్ డి ఓ ఆర్ నూకరాజు,మత్స్య శాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు,ఫీల్డ్ మాన్ కె సురేష్,గ్రామ మత్స్య సహాయకులు వి. శ్రీనుబాబు,జె అచ్చిరాజు,జె సునీత,ఎం మౌనిక,మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్స్యకారులు పాల్గొన్నారు