

మనన్యూస్,గద్వాల జిల్లా:ధన్వాడ,చుట్టూ పక్కల గ్రామాలకు అండగా ఉంటాం సీఎం దృష్టికి ఫ్యాక్టరీ సమస్య ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ధన్వాడ తో పాటు 12 గ్రామాలు రిలే నిరాహారదీక్ష లు చేపట్టాయి.కాగా వారి దీక్షకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు పాల్గొని సంఘీభావం తెలిపారు.అలంపూర్ నియోజకవర్గ ములో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్డీఎస్ నీటిపై ఆధారపడి సేద్యమే జీవనాదారంగా జీవిస్తున్న రైతుల పోలాల మధ్య విష వాయువులు వెలువడే కంపెనీలు పెట్టి వారి ప్రాణాలను ఆపదలో పడేయోద్దని అన్నారు.ఈ ఫ్యాక్టరీ నిర్మించవద్దని గతంలోనే గడిచిన ఏడాది లోనే సీఎం రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు.ఇంకా ఫ్యాక్టరీ పనులు మొదలు కాకపోవటంతో పనులను ఇప్పుడే నిలిపేసి ప్రజలకు సహకరించాలని అన్నారు.నిరసన చేస్తున్న వారికి అన్ని వేళలా అండగా ఉంటూ,వారి పోరాటం కు అన్ని విధాలా సహకారాలు అందిస్తామని అన్నారు.పారిశ్రామిక మంత్రి,ఇతర ఉన్నత అధికార్లను కలిసి ఫ్యాక్టరీ పనులు నిలిపేసేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు,ప్రజలు,మాజీ ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
