

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ గుర్తింపు లేని 73ఆబాoడెడ్ (స్క్రబ్) వాహనాలకు రేపు (30.01.2025)బహిరంగా వేలం,ఆసక్తి గల బిడ్డర్స్ ఈ రోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు 200/రూపాయలు చెల్లించి,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీ తో వేలం లో పాల్గొనగలరు,జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్,పోలీస్ తనఖిలలో పట్టుబడి ఎవరు గుర్తించ లేని (స్క్రాబ్) వాహనాలకు రేపు (30.01.2025) ఉదయం 09:00 గంటలకు బహిరంగవేలం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.
ఆబాoడెడ్ వాహనాలుగా ఉన్న 73 (స్క్రాబ్) వాహనాలకు రేపు ఉదయం 09:00 గంటలకు గద్వాలజిల్లా PJP క్యాంప్ లోని పోలీస్ సాయుధ దళ కార్యాలయ అవరణ లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాలను బాదితులు గుర్తించి తీసుకెళ్ళేందుకు ఇచ్చిన గడువు ముగిసినందున రేపు బహిరంగా వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో గల 73 ద్వి చక్ర (స్క్రాబ్) వాహనాలను జిల్లా కేంద్రం లోని పోలీస్ సాయుధ దళ కార్యాలయం ఆవరణం లో ఉంచడం జరిగిందని, వేలంలో పాల్గొనదల్చిన ఈ రోజు సాయంత్రం వరకు వేలం వేసే వాహనాలను చూసుకొని వేలంలో పాల్గొనదల్చిన వారు ఈ రోజు సాయంత్రం వరకు 200/- రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించి, పేరు నమోదు చేసుకొని రేపు బహిరంగ వేలం లో పాల్గొనాలని ఇతర వివరాలకు ఆర్. ఐ సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
వివరాలకు 87126 70281 ను సంప్రదించగలరు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్